ఆనందం - Vol. 1 - Telugu Original Love Songs | Warm Acoustic Vintage Vibes | Dhvani Music Originals
- Get link
- X
- Other Apps
ఆనందం - Vol. 1 - Telugu Original Love Songs
Dhvani Music Originals అందిస్తున్న "ఆనందం - Vol. 1" కు స్వాగతం.
స్వచ్ఛమైన తెలుగు పద్యంలాంటి సాహిత్యం, ఆనాటి వీనులవిందైన సంగీతం, పాత జ్ఞాపకాలను రేకెత్తించే 'ప్రణయం' నేపథ్యంగా ఈ పాటలు రూపొందాయి. మీ రోజువారీ పనుల్లో, ఏకాంత రాత్రుల్లో మీ మనసుకు హాయినిచ్చే ఒక అందమైన ఆడియో తోడు ఈ ఆనందం with warm acoustic vintage vibes.
హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఈ మధురమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి.
CREDITS:
Lyrics & Direction: C. Raghothama Rao, Dhvani Music
Label: Dhvani Music Originals - Vintage Vibes
సాహిత్యం / LYRICS:
1. మాటంటే ఏదో తెలిసేది కాదు
మాటంటే ఏదో తెలిసేది కాదు
పాటంటే ఏదో తోచేది కాదు
ఆనాటి రాత్రి నిను చూసినాక
నేనే మాటనై...పాటనై పోయాను...
మాటంటే ఏదో తెలిసేది కాదు
పాటంటే ఏదో తోచేది కాదు
అందాలభరిణవా? కావు...
కుందనపు బొమ్మవా? కావు...
అందాలభరిణవా? కావు...
కుందనపు బొమ్మవా? కావు...
కానీ...నాకు...నీవు
అందిన అమృతానివి
సుందర స్వప్నానివి
ఛందస్సు కుదిరిన పద్యానివి!
మాటంటే ఏదో తెలిసేది కాదు
పాటంటే ఏదో తోచేది కాదు
ఆనాటి రాత్రి నిను చూసినాక
నేనే మాటనై...పాటనై పోయాను...
అందమంటే చర్మానిదా?
అందమంటే హృదయానిదా?
ఇందాకా తెలియదే, ఇపుడే తెలిసిందే
ముందున్న నిన్ను చూసాకా
కళ్ళ ముందున్న నిన్ను కలిసాక!
మాటంటే ఏదో తెలిసేది కాదు
పాటంటే ఏదో తోచేది కాదు
ఆనాటి రాత్రి నిను చూసినాక
నేనే మాటనై...పాటనై పోయాను...
మాటనై...పాటనై మిగిలాను...నీకై...
*****
2. నీ రూపాన్నీమాటలలో మార్చేలా
నీ రూపాన్నీ...
మాటలలో...మార్చేలా
మాటలనే పద్యాల్లా...
హృద్యంగా కూర్చేలా...
నే రాసానే
ఈ పాటా...ఈ పూట!
నా ప్రేమే పల్లవిగా...
నా ఊహే చరణంగా..
ఈ పిల్లగాలి....
చిలిపిగా పలికింది
ఆ మల్లెతీగ...
విరబూసి కులికింది
దూరం దూరం అనకుండా
దగ్గర దగ్గర చేరాలనీ....
నీ రూపాన్నీ...
మాటలలో...మార్చేలా
మాటలనే పద్యాల్లా...
హృద్యంగా కూర్చేలా...
నీ నుదుటి బొట్టూ...
వెలిగిందే...చంద్రవంకై
నీ చెవిలో కమ్మా....
మెరిసిందే...మెరుపు తీగై...
ఎవరూ నీవూ అనకుండా
నేనే నీ వాడిగా
నీ రూపాన్నీ...
మాటలలో...మార్చేలా
మాటలనే పద్యాల్లా...
హృద్యంగా కూర్చేలా...
నే రాసానే
ఈ పాటా...ఈ పూట!
నా ప్రేమే పల్లవిగా...
నా ఊహే చరణంగా..
****
3. మరచిపోకు ప్రియతమా
మరచిపోకు ప్రియతమా
తెరచిన నా హృదయాన్ని
విడిచిపోకు ప్రియతమా
గడియకైనా నా గుండెను
మరచిపోకు ప్రియతమా
తెరచిన నా హృదయాన్ని
నా మనసే తేనెపట్టు
నీ చూపే తేనెటీగ
ఒక్కొక్కటిగా చేర్చవా
తియతియ్యని తీపి గురుతులు!
మరచిపోకు ప్రియతమా
తెరచిన నా హృదయాన్ని
విడిచిపోకు ప్రియతమా
గడియకైనా నా గుండెను
నా ఊహలే పూల తోటలు
నీ నవ్వులే నీటి జల్లులు
వికసించనియ్యవా
రంగుల కలలు
మరచిపోకు ప్రియతమా
తెరచిన నా హృదయాన్ని
విడిచిపోకు ప్రియతమా
గడియకైనా నా గుండెను
నా మాటలే నీలాకాశం
నీ పిలుపులే వెలుగు చుక్కలు
వెదజల్లనియ్యవా
వలపుల వెండి వెన్నెలలు
మరచిపోకు ప్రియతమా
తెరచిన నా హృదయాన్ని
విడిచిపోకు ప్రియతమా
గడియకైనా....నా గుండెను....
*****
Welcome to Anandam - Vol. 1 by Dhvani Music Originals.
Step into the golden era of soulful music coupled with heart-warming poetry. With this collection of three original romantic Telugu ballads, crafted for the silent listeners and night owls, these warm acoustic waltzes explore the deep, timeless emotion of love (Pranayam / Prema).
Let the warm and poetic Telugu lyrics serve as your perfect background companion for work, study, or late-night nostalgia.
Put on your headphones, step into the past, and let the music speak.
SUBSCRIBE & SUPPORT TELUGU INDEPENDENT MUSIC.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment