నింగి నుండి నీటిలోకి | Ningi Nundi Neetiloki | Telugu Nature Melody | Dhvani Music

 

నింగి నుండి నీటిలోకి తొంగి చూసే తార 

Telugu Nature Song Melody

Mohana Raga Inspired

Concept, Lyrics & Creative Direction: C. Raghothama Rao, Dhvani Music


This video features the song "Ningi Nundi Neetiloki", an original cinematic lyrical piece presented by Dhvani Music. The song is a beautiful celebration of nature, describing its elegance and wonders through poetic Telugu verses.  The song expresses deep appreciation for the natural world, using imagery like stars peeping into water, gentle winds swaying branches, and the dawn bringing light to nature after darkness. The composition is based on traditional classical ragas, aiming to provide a soothing and peaceful listening experience. The video is crafted with cinematic visuals set in a beautiful Telugu village environment, perfectly complementing the rhythm and meaning of the lyrics.


నింగి నుండి నీటిలోకి LYRICS


నింగి నుండి, నీటిలోకి
తొంగి చూసే తార,
సంబరంగా కొమ్మనూపి
పాట పాడే గాలి


మంచుతెరల, చాటు నుండి
పొంచి చూసే...పొంకం!


నింగి నుండి, నీటిలోకి
తొంగి చూసే తార,
సంబరంగా కొమ్మనూపి
పాట పాడే గాలి


అలక పూనిన కడలికి
అలలే అందం
కలత చెందిన కలువకు
నెలరాజే నందం


పచ్చగ పెరిగే తీగకు
విచ్చిన పూలే...ఆనందం


నింగి నుండి, నీటిలోకి
తొంగి చూసే తార,
సంబరంగా కొమ్మనూపి
పాట పాడే గాలి


రేకులు విప్పిన వసంతానికి
కోకిల పాటే అందం
రెక్కలు వచ్చిన పిట్టపిల్లకు
ఆకసమే నందం


చీకటి కమ్మిన ప్రకృతికి
వేకువ వెలుగే...ఆనందం


నింగి నుండి, నీటిలోకి
తొంగి చూసే తార,
సంబరంగా కొమ్మనూపి
పాట పాడే గాలి


మంచుతెరల, చాటు నుండి
పొంచి చూసే...పొంకం!


Support Dhvani Music
Independent music needs your generous support

ఈ పాట ఎలా పుట్టింది? ఒక మధురమైన రాత్రి, 15 నిమిషాల ప్రయాణం


ప్రకృతికి ఒక చిరుకానుక

కొన్నిసార్లు ఒక అద్భుతమైన సృష్టి జరగడానికి ఒక చిన్న ప్రేరణ చాలు. ఒక బద్ధకమైన మధ్యాహ్న సమయాన, నేలపై ప్రశాంతంగా పడుకుని పాత పాటలు వింటున్నాను. అప్పుడు మహానటి భానుమతి గారు పాడిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మల్లీశ్వరి సినిమాలోని "ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు..." పాట నా చెవిన పడింది. ఆ పాటలోని మాధుర్యం, ఆకాశం మీదుగా సాగే ఆ భావన నా మనసులో అలానే ముద్రించుకుపోయింది.

ఆ రోజు రాత్రి ఎంతకీ నిద్ర పట్టలేదు. మధ్యాహ్నం విన్న ఆ పాట తాలూకు ఆలాపన మనసులో ఇంకా మార్మోగుతూనే ఉంది. ఆ నిశ్శబ్దపు రాత్రి వేళ, ఆకాశాన్ని ఊహించుకుంటూ కలం పట్టాను. నా ఆలోచనల ప్రవాహానికి అక్షర రూపం ఇస్తూ, ఆ పాత పాట ఇచ్చిన స్ఫూర్తితో కేవలం 15 నిమిషాల్లో ఈ "నింగి నుండి నీటిలోకి" పాటను రాసి పూర్తి చేశాను!

ఈ పాట నింగి (ఆకాశం) నుండి నీటిలోకి (భూమిపైకి) సాగే ప్రకృతి ప్రయాణాన్ని, ఆ ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని చాలా సరళమైన పదాలతో వివరిస్తుంది. ఒక మధురమైన పాత పాట ప్రేరణతో పుట్టిన ఈ కొత్త పాట మీ మనసుకు కూడా అంతే ప్రశాంతతను ఇస్తుందని ఆశిస్తున్నాను.

ఈ ప్రకృతి గీతం మీ మనసుకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. మీకు నచ్చితే, ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి.

మరిన్ని స్వతంత్ర తెలుగు గీతాల కోసం Dhvani Music ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి: https://www.youtube.com/@DhvaniMusic








Comments

Popular Posts

వాన జారు వేళలో | Telugu Rain Song Melody| Sumanesa Ranjani Raga Inspired | Dhvani Music Originals |

బతుకు ప్రయాణం | The Harsh Reality of Life | Dark Telugu Original | Dhvani Music