! కెరటమా! ఓ కెరటమా! SUBSCRIBE TO DHVANI MUSIC కడలి పాట! ఇది తడి ఆరని గుండె పాట. అలుపెరుగని జలధి చేసే చిరంతన ఘోష.
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
వాన జారు వేళలో | Telugu Rain Song Melody| Sumanesa Ranjani Raga Inspired | Dhvani Music Originals |
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
వాన జారు వేళలో
Telugu Rain Song Melody
Sumanesa Ranjani Raga Inspired
Concept, Lyrics & Creative Direction: C. Raghothama Rao, Dhvani Music
This video features the original Telugu independent song "Vaana Jaaru Velalo" (In the time of falling rain). It is a melodic composition created by Dhvani Music, blending elements of Lalitha Sangeetham (light music) with a traditional raga-based structure, specifically inspired by Sumanesa Ranjani and Brindavana Saranga.
వాన జారు వేళలో Song Lyrics
వాన జారు వేళలో
అనుకోని అతిథిలా
నా ఇంటికి, పొదరింటికి
వచ్చావు నువ్వలా....
వాలినావు గువ్వలా....
వాన జారు వేళలో....
మరచిపోయిన గురుతులే
మరలి వచ్చిన రీతిగా
విడిచిపోయిన నేస్తమే
కదలి వచ్చిన చందమై
తిరిగి చూడని కన్నులే
వెనుదిరిగి చూసిన ఘడియలా...
వాన జారు వేళలో
చదవ మరచిన పొత్తమా!
చూడ మరచిన చిత్రమా!
పాడ మరచిన రాగమా!
మనువాడ మరచిన మగువా!
ఎవరవని? ఎందుకని?
వాన జారు వేళలో
అనుకోని అతిథిలా
నా ఇంటికి, పొదరింటికి
వచ్చావు నువ్వలా....
వాలినావు గువ్వలా....
నా...కంటికి...కనిపించావు...దివ్వెలా!
Independent music needs your generous support
ఈ పాట నేపధ్యం
ఒక సాయంత్రం వేళ, నా స్టడీ రూమ్ కిటికీ ప్రక్కనే కూర్చుని, బయటి ప్రకృతిని చూస్తున్నాను. ఉన్నట్టుండి మబ్బులు కమ్మి, జోరున వర్షం మొదలయింది.
వర్షం మొదలవుతుండగా ఒక పిట్ట వచ్చి, అదిగో పై ఫోటో లో మీకు కనబడుతున్న తీగ మీద కూర్చుంది. నేను నా మొబైల్ తీసుకుని కెమెరా ఆన్ చేసే సరికి ఎగిరిపోయింది. అలా, వర్ష ప్రకృతి నా కెమెరా కన్నుకు చిక్కింది కానీ, పిట్ట మాత్రం పారిపోయింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ, ఒక అబ్బాయికి తను ఎప్పుడో ప్రేమించిన అమ్మాయి అనుకోకుండా కనబడి, అంతలోనే మాయమైపోతే, అతని మనసు కవితాత్మకంగా ఎలా స్పందిస్తుంది? బహుశా ఇలానే ఏమో అని ఊహిస్తూ వ్రాసిన పాట ఈ "వాన జారు వేళలో..."
ఇది వ్రాయడానికి సుమారుగా పది నిముషాలు పట్టింది. వ్రాసిన తర్వాత చదువుకుంటే ఎలాంటి ఎడిటింగ్ అవసరం లేదని అనిపించింది. వెంటనే పాటకు ట్యూన్ కట్టించే ప్రయత్నం చేసాను. నాకున్న చాలా పరిమితమైన కర్ణాటక సంగీతపు రాగాల అవగాహనతో బృందావన సారంగ రాగంలో చేయమని కృత్రిమ మేధకు చెప్పాను. అదేమో ’సుమనేశ రంజని’ రాగంలో ట్యూన్ చేసిందని నా మిత్రుడు, గాయకుడు అయిన పైడిమర్రి అరుణ్ చెప్పగా సంతోషించాను. ఏదైతేనేం, అరుపులు కేకలు ఊపులు కాకుండా కృ.మే. ఒక చక్కటి కర్ణాటక సంగీతం బాణీలో నా పాటను స్వరపరచడం నా వరకూ ఓ అద్భుతమే.
ఆపై, కృ.మే. ను వాడుకుని పాటకు దృశ్య రూపాన్ని ఇచ్చే పనిలో పడ్డాను. ఇక్కడ మాత్రం ఎక్కడలేని కష్టాలను అనుభవించాననే చెప్పాలి. ఇమేజ్ బాగుంటే, అది వీడియో మార్చేప్పుడు కృ.మే ఇష్టం వచ్చిన రీతిలో ఉన్నవి, లేనివి చేర్చేసేది. దాన్ని సరిచేసి, దారికి లాక్కోచ్చేసరికి క్రెడిట్స్ ఐపోయేవి. ఎలాగైతేనేం, మూడు రోజులు ముప్పుతిప్పలు పడి చివరకు పాటకు కదిలే బొమ్మలను చేర్చగలిగాను.
ఈ "వాన జారు వేళలో..." పాట సాహిత్యం, కృ.మే. సమకూర్చిన బాణీ, వాయిద్యాల అమరికపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో పంచుకోండి. అలానే, నా దృశ్యీకరణ గురించి కూడా ఓ మాట చెప్పేయండి. మీకు ఈ పాట నచ్చితే దయచేసి పాట వీడియో లింక్ ను ఇతరులతో పంచుకోండి. తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్ కు మీ చేయూతను అందివ్వండి.
బ్రతుకు ప్రయాణం! రైలు...రైలు Telugu Dark Themed Song Inspired by the Harsh Realities of Life Concept, Lyrics & Creative Direction: C. Raghothama Rao, Dhvani Music "Railu Ee Railu" (రైలు.... ఈ రైలు....) is not your typical cinematic music video. Produced by Dhvani Music Originals, this dark Telugu indie song uses the relentless, mechanical motion of a train as a metaphor for the harsh realities of life, fate, and survival. Stripping away the sweet melodies, this track features an industrial beat, gritty vocals, and raw visual storytelling about the struggles we all silently carry. రైలు...ఈ రైలు LYRICS రైలు.... రైలు.... ఎక్కి దిగే బతుకులు వేలకు వేలు రైలు.... ఈ రైలు.... రగిలే ఎదలు పగిలే ఆశలు వెదికే కన్నులు ముగిసిన కథలు బండబారి పోయిన గుండెకాయ గుబులు రైలు.... ఈ రైలు.... ఎన్నో క్లాసులు ఎన్నో యాసలు ఏవో ఘోషలు కలగూర గంపలా రైలు.... ఈ రైలు.... దాని కూత వెతల మోత విధి రాసిన వక్రగీత.... రైలు.... ఈ రైలు.... విధాత...చేతివ్రాలు Independent music needs your generous support జ...
నింగి నుండి నీటిలోకి తొంగి చూసే తార Telugu Nature Song Melody Mohana Raga Inspired Concept, Lyrics & Creative Direction: C. Raghothama Rao, Dhvani Music This video features the song "Ningi Nundi Neetiloki", an original cinematic lyrical piece presented by Dhvani Music. The song is a beautiful celebration of nature, describing its elegance and wonders through poetic Telugu verses. The song expresses deep appreciation for the natural world, using imagery like stars peeping into water, gentle winds swaying branches, and the dawn bringing light to nature after darkness. The composition is based on traditional classical ragas, aiming to provide a soothing and peaceful listening experience. The video is crafted with cinematic visuals set in a beautiful Telugu village environment, perfectly complementing the rhythm and meaning of the lyrics. నింగి నుండి నీటిలోకి LYRICS నింగి నుండి, నీటిలోకి తొంగి చూసే తార, సంబరంగా కొమ్మనూపి పాట పాడే గాలి మంచుతెరల, చాటు నుండి పొంచి చూసే.....
Comments
Post a Comment