కడలి పాట (Kadali Paata) –Telugu Ocean LoFi Songs to Relax & Unwind 🌊🎶 | Poetic Musical Suite
!
కెరటమా! ఓ కెరటమా!
కడలి పాట! ఇది తడి ఆరని గుండె పాట. అలుపెరుగని జలధి చేసే చిరంతన ఘోష.
🎵 Credits:
Lyrics & Concept: C. Raghothama Rao (Dhvani Music)
Audio & Visual Production: Dhvani Music
Welcome to Dhvani Music.
"Kadali Paata" is a continuous 3-act Telugu Nature LoFi musical suite blending soulful vocals, spoken-word prose, and gentle ocean ambience. Designed for quiet evenings, deep reflection, and unwinding, this piece traces a poetic journey from the restless waves at dusk to the philosophical stillness of the moonlit sea.
📝 సాహిత్యం LYRICS
ACT - I
మాట / Prose:
కడలి పాట. ఇది తడి ఆరని గుండె పాట. అలుపెరుగని జలధి చేసే చిరంతన ఘోష.
పాట / Song:
కెరటమా! ఓ కెరటమా!
కడలి ఎడదలోని ఆరటమా!
పడి లేచే పోరాటమా!
కెరటమా! ఓ కెరటమా!
నురగలు కక్కుతూ పరుగులతో
నువు చేరేది తీరం వరకే
అలుపును ఎరగని తెగువుతో
నువు లేచేవు వెనువెంటనే
ఎందుకలా చేస్తావు?
మతి లేకనా? గతి తప్పకనా?
కెరటమా! ఓ కెరటమా!
కడలి ఎడదలోని ఆరటమా!
పడి లేచే పోరాటమా!
హద్దులు పెట్టి వద్దంటున్నా
యుద్ధం చేసే సైనికునిలా
పొద్దు పొద్దుకూ పొంగుతావు
హద్దులను ఎద్దేవా చేసేవు
ఎందుకలా చేస్తావు?
బలముందనా? ఛలముందనా?
కెరటమా! ఓ కెరటమా!
కడలి ఎడదలోని ఆరటమా!
పడి లేచే పోరాటమా!
కెరటమా! ఓ కెరటమా!
ప్రకృతి ప్రకటించిన విప్లవ కేతనమా!
కె...ర...ట...మా....
ACT - 2
మాట / Prose:
పాట / Song:
అలలే అలజడి చేసినా
పెనుగాలే పెనుగులాడినా
ఆకసమే వానగా కురిసినా
కల్లోలాలే చెలరేగినా
అల్లాడవుగా ఓ కడలీ
బడలిక ఎరుగని ఓ కడలీ!
పడవల నుండి ఓడల వరకూ
అడుగు అడుగునూ చీలుస్తున్నా
గలం నుండి తిమింగలం వరకూ
అడుగంటా నిను శోధిస్తున్నా
అల్లాడవుగా ఓ కడలీ
బడలిక ఎరుగని ఓ కడలీ!
ఒడ్డున ఉన్నవారిని ఆకట్టేవు
నడిమధ్యన ఉన్నవారిని భయపెట్టేవు
నింగిని నేలకు ముడిపెట్టేవు
బడబాగ్నులను తడగట్టేవు
అందుకే ఓ కడలీ
అందుకో నా వందనం ఓ కడలీ
బడలిక ఎరుగని ఓ కడలీ
యుగయుగాల జాడల
కడమెరిగిన ఓ కడలీ....
ACT 3
మాట / Prose:
సంద్రమా! యుగాల నుండీ మారకుండా ఉండే నీవెవరు? ఒక్క బ్రతుకులోనే మతిని పోగొట్టుకునే నేనెవరిని?
పాట / Song:
కవులకు కమనీయ దృశ్యానివి
చిత్రకృత్తులకు చిత్రపటానివి
విరహిణులకు విహ్వలకారివి
వేదాంతులకు బోధకశక్తివి
ఏమని తెలియాలి నిన్ను?
అవారపారమా!
ఎవరని తెలియాని నిన్ను?
ఘూర్ణిత తరంగ అర్ణవమా!
లక్ష్మిదేవికి పుట్టినిల్లట!
లక్ష్మీధరునికి శయనమందిరమట!
అమృతానికి ఆలవాలమట
నదులన్నింటికి ప్రాణప్రదమట
ఏమని తెలియాలి నిన్ను?
అవారపారమా!
ఎవరని తెలియాని నిన్ను?
ఘూర్ణిత తరంగ అర్ణవమా!
సంసారానికి పోలిక నీవు
కరుణగుణానికి కొలతవు నీవు
జ్ఞాన సంపదకు గురుతువు నీవు
ప్రకృతి వికృతుల మధ్య సరిహద్దువు నీవు
ఏమని తెలియాలి నిన్ను?
అవారపారమా!
ఎవరని తెలియాని నిన్ను?
ఘూర్ణిత తరంగ అర్ణవమా!
ముగింపు / CLOSURE:
కలంకు అందని పాట...కడలి పాట...
కలలు కనే మనసుకు చెందిన పాట...ఈ కడలి పాట!
*****
ఈ ప్రయోగం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలియజేయండి. మీ సూచనలు, విమర్శలు ఎప్పుడూ స్వాగతం.
If you enjoyed this listening experience, feel free to share your thoughts and constructive feedback in the comments below.
Comments
Post a Comment