మనసుని హత్తుకునే తెలుగు లోఫై ప్రేమ గీతాలు | 1 Hour Relaxing Telugu LoFi Mix & Original Lyrics

 మనసుని హత్తుకునే తెలుగు లోఫై ప్రేమ గీతాలు 

1 Hour Relaxing Telugu LoFi Mix & Original Lyrics



Telugu Lyrics: C. Raghothama Rao, Dhvani Music
Label: Dhvani Music Originals - Telugu Lo-Fi Romantic Songs Vol. 1

రాత్రి పూట ప్రశాంతమైన వాతావరణంలో, వర్షం పడుతున్నప్పుడు మనసుకు హాయినిచ్చే సంగీతం వినాలనిపిస్తుందా? మీ కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఈ 'ఒరిజినల్ తెలుగు లోఫై ప్రేమ గీతాల' (Original Telugu Lo-Fi Romantic Songs) కలయిక. ఆధునిక లోఫై సంగీతానికి, అచ్చమైన తెలుగు కవిత్వం తోడైతే ఆ అనుభూతే వేరు.

చదువుకునేటప్పుడు ఏకాగ్రత కోసం, ఆఫీసు పని ఒత్తిడిలో మనసుని రిలాక్స్ చేసుకోవడానికి (Mind relaxing songs Telugu), లేదా రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోవడానికి ఈ 1 గంట నిడివి గల మ్యూజిక్ ఎంతో అద్భుతంగా సరిపోతుంది. ఇందులో స్వచ్ఛమైన తెలుగు సాహిత్యంతో కూడిన 6 సుమధురమైన గీతాలు, మధ్యలో వీనులవిందైన వాయిద్య సంగీతం (Telugu BGM) మిళితమై ఉన్నాయి.

యూట్యూబ్ శ్రోతల మన్ననలు పొందిన ఈ ఒరిజినల్ ట్రాక్స్ యొక్క పూర్తి సాహిత్యాన్ని (Lyrics) ఇక్కడ మీకోసం పొందుపరుస్తున్నాను. ఈ పైనున్న వీడియో ప్లేయర్ ద్వారా సంగీతాన్ని ఆస్వాదిస్తూనే, ఈ అందమైన తెలుగు కవిత్వాన్ని చదివి ఆనందించండి.


LYRICS:


1.  నిదురించు వెదురు పొదలోన సొదరేగి

నిదురించు వెదురు,

పొదలోన సొదరేగి

మధుర గానం పలికె

నిదుర చెదరగ ఇపుడు!


కణుపు, కణుపున గాలి

కణము,‌ కణమున చేరి

ప్రణయ భావన చెలగి

ప్రాణమయ్యెను రాగం

ప్రీణమయ్యెను గానం


ఉంగరాలు మెరవ, రంగారు వేళ్ళతో

శృంగార రాగమే పొంగి రాగా

అంగనామణికి అంగవశమే తప్పె

గంగలా ఉప్పొంగె సంగమాన


యామినీ వేళలో, యమునా తటములో

ఏమాయెనో సఖా! ఈ మాయ సోకగా!

ఏ మాట రాదుగా నీ పాట తప్ప

ఏమరిక లేదుగా నీ తలపు తప్ప


2. పాట పాతదైతేనేమి?


పాట పాతదైతేనేమి?

ఆడే నాగులా,

మనసు ఊగుతున్నప్పుడు!


దూరాన్ని దగ్గరగా మార్చి

కాలాన్ని వేళ్ళపై కొలిచి

రాగాల రంగులరాట్నంపై

గిరగిరా తిరుగుతున్నప్పుడు


మాటరాని మూగదైనా

రెక్కలొచ్చిన పిట్ట ఒక్కటి

రెక్కలార్చిన చప్పుడు

చుక్కల దాకా చేరినప్పుడు


గాలి తాళానికి తల ఊపుతూ

ఆడే దీపం నీడను

చూపే ఆ గోడను చూడు

ఏదో గుర్తుకు వస్తోంది కదూ?


నీ...చెవులకు ఆత్మ...ఉన్నప్పుడు!


3. తెలియని రాగమేదో

తెలియని రాగమేదో

తేలి వచ్చి సోకెనే

పలుక నేర్చి భావమేదో

మదిని చేరి పాడెనే

హృదయరాగమై…హృదయరాగమై


కనులు చేసే నర్తనం

వేవేల భావ వీక్షణం

శృతిలయల జీవనం

మితిలేని రస నివేదనం

హృదయరాగమై…హృదయరాగమై


సోమపానమెందుకో

సుఖపాన లీన జీవికి

సామగానమయ్యెనే

నీ చిరునవ్వు చేయు సవ్వడి

హృదయరాగమై…హృదయరాగమై


తెలియని రాగమేదో

తేలి వచ్చి సోకెనే

పలుక నేర్చి భావమేదో

మదిని చేరి పాడెనే


4. మరచిపోకు ప్రియతమా

మరచిపోకు ప్రియతమా

తెరచిన నా హృదయాన్ని

విడిచిపోకు ప్రియతమా

గడియైన నా గుండెను


నా మనసే తేనెపట్టు

నీ చూపే తేనెటీగ

ఒక్కొక్కటిగా చేర్చవా

తియతియ్యని తీపి గురుతులు!


నా ఊహలే పూల తోటలు

నీ నవ్వులే నీటి జల్లులు

వికసించనియ్యవా

రంగుల కలలు


నా మాటలే నీలాకాశం

నీ పిలుపులే వెలుగు చుక్కలు

వెదజల్లనియ్యవా

వలపుల వెండి వెన్నెలలు


5. నీలాల నింగి, కళ్ళల్లో వంగి

నీలాల నింగి, కళ్ళల్లో వంగి

నింపింది నక్షత్ర స్వప్నం

వీచేటి గాలి, ఎదలోన కదలి

పలికింది సప్త స్వరాల్ని


ఈ జన్మకైన, మరుజన్మకైన

మరే  జన్మజన్మకైనా, 

నా ప్రాణం, నా గానం

నీవే నీవే నీవే

ఓ...ఓ...ఓ...

అందం, చందం, భాగ్యం, యోగం, అన్ని నీవే నీవే

నీ నీడలోనే నా జాడ వుంది

నిజం, నిజంగా


కనలేనివన్నీ కనిపించు వేళ

కను మూసివుంటావా నువ్వూ!

వినువిందు చేసే వింతైన పాట

వినకుండా పోతావా నువ్వూ!

ఈవేళ నాలో విరిసే వసంతం

అవుతుంది నీకే స్వంతం

ఓ...ఓ...ఓ...

అందం, చందం, భాగ్యం, యోగం, అన్ని నీవే నీవే

నీ నీడలోనే నా జాడ వుంది

నిజం, నిజంగా

నిజం, నిజంగా

నిజం....నిజంగా....


6. నిన్ను చూసినంతనే శిశిరంలో వసంతం

నిన్ను చూసినంతనే శిశిరంలో వసంతం

జ్ఞాపకాల గుబురులో ఆకుపచ్చని ప్రశాంతం       


ఆ ఆకసాన తేలు జాబిలికి చాలు ఒక పున్నమి

నా జాలితనము కోరునే ప్రతిరోజు వెన్నలని

ఇది వరమో శాపమో లేక సుమశరుని జాలమో!

సిరిమల్లె మురిసి విరిసేటి మధుర కాలమో!        


అలలేని సాగరమా నీవు! 

మేఘాలు చూడని సౌందర్యమా!

నునులేత చివురుల ముద్దులిడే మంచుముత్యమా!

ఇది కన్న కలనా విన్న కథనా లేక జన్మజన్మల స్మృతినా?

సెలయేటి నీటి పాటలో కదిలే వర్షగీతమా?         


కొలనులోని కలువకు ఆ నీరే అద్దమా!

ఒక చూపురాయి వేసినంతనే చెదిరేది అందమా?

నిష్ఫల ఎడారి దారిలో ఏలనో పూల నర్తనం?

కశ్మలమంటని గుండె లోతులో కన్నీటి వర్తనం!    

*****








Comments

Popular Posts

వాన జారు వేళలో | Telugu Rain Song Melody| Sumanesa Ranjani Raga Inspired | Dhvani Music Originals |

బతుకు ప్రయాణం | The Harsh Reality of Life | Dark Telugu Original | Dhvani Music

నింగి నుండి నీటిలోకి | Ningi Nundi Neetiloki | Telugu Nature Melody | Dhvani Music